: సికింద్రాబాదులో దొరికిన 12 కిలోల బంగారం
సికింద్రాబాదులో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న 12 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇవాళ (శనివారం) ఉదయం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారం బయటపడింది. పన్ను కట్టకుండా బంగారం వ్యాపారం చేస్తున్నారని తేలడంతో.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని ఆదాయ, వాణిజ్య పన్నుల శాఖకు అప్పగించారు. బంగారం విలువ సుమారు నాలుగు కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వర్ణాభరణాలను సికింద్రాబాదు జనరల్ బజారులో ఉన్న జ్యువెలరీ దుకాణాలను సరఫరా చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.