: ఐఫోన్ 6పై పెరుగుతున్న ఆసక్తి


ఐ ఫోన్ 5ఎస్, సీ తర్వాత యాపిల్ ఇంజనీర్లు ఐఫోన్ 6పై తీవ్ర స్థాయిలో్ పరిశోధన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని ఫీచర్ల విషయంలో అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. 6 అంగుళాల స్క్రీన్ తో యాపిల్ ప్రయోగం చేయనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ లోగడ పేర్కొనగా.. తాజాగా చైనీస్ ఫాక్స్ కామ్ ఇంజనీర్లు మాత్రం 4.7, 5.7 అంగుళాల సైజులో రెండు రకాలను తీసుకురానుందని చెబుతున్నారు. ఇందులో కంటి పాపలను గుర్తించే టెక్నాలజీ... అలాగే, చేతి వేలి ముద్రలను గుర్తించి లాక్ తెరచుకునే టెక్నాలజీ కూడా ఉంటుందని అంటున్నారు. ఐఫోన్ 6లో ఇంకా 64బిట్ ఎ8 ప్రాసెసర్, గీతలు పడని బాడీ, వైర్ లెస్ చార్జింగ్, సోలార్ ప్యానెల్ ద్వారా చార్జింగ్ సదుపాయాలు ఉంటాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి అద్భుత ఫీచర్లు అసలు ఎన్నుంటాయన్నది ఐఫోన్ 6 వస్తేగానీ తెలియదు. ఇక, 12.9 అంగుళాల హై రిజల్యూషన్ స్క్రీన్ తో ఐప్యాడ్ ప్రో టాబ్లెన్ ను ఈ ఏడాది విడుదల చేసేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News