: దుకాణం మూసివేయొద్దని చిరంజీవికి అప్పుడే చెప్పా: నారాయణ
తన వర్గం నేతలతో చిరంజీవి నిన్న సమావేశమవడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందించారు. ఆయన వర్గం ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని... ఎవరు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే తెలియడం లేదని చెప్పారు. పీఆర్పీ దుకాణం మూసుకోవద్దని తాను చిరంజీవికి ఎప్పుడో చెప్పానని... తన మాటను ఆయన పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా దారుణంగా తయారైందని తెలిపారు.