: చర్చ ప్రారంభం కాలేదు.. నా పార్టీపై అన్నీ పుకార్లే: సీఎం
తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ ఇంకా ప్రారంభం కాలేదని, సోమవారం నుంచి చర్చ ప్రారంభం అవుతుందని భావిస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ పెడుతున్నానంటూ వస్తున్నవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టానని, భవిష్యత్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
పార్టీలన్నీ అభిప్రాయాలు చెబితేనే పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు. ఓటింగ్ జరగకుండా అభిప్రాయాలు చెప్పాలనడం హాస్యాస్పదం అని, ఓటింగ్ లేనప్పుడు ఆ అభిప్రాయాలకు విలువేం ఉంటుందని ఆయన చెప్పారు. దేశంలో ఓటింగ్ లేకుండా ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా? అని ఆయన ప్రశ్నించారు. సమైక్య తీర్మానం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.