: ఆరోపణలు కాదు.. ఆధారాలతో రండి: సీఎం సవాలు
తనపై చాలా మంది ఆరోపణలు చేస్తున్నారని, అయితే వారు ఆధారాలతో వస్తే సమాధానం చెబుతానని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సవాలు విసిరారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తాను సీఎం అయిన తరువాత 30 మంది పార్టీని వీడారని, మరింత మంది పార్టీని వీడుతారనే వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. పార్టీని వీడాలని నిర్ణయించుకున్న వారిని ఏం చెప్పి, ఎంత ఒత్తిడి తెచ్చి ఆపుతామని ఆయన ప్రశ్నించారు. తన పాలన తెరిచిన పుస్తకమని అన్న సీఎం, ఆరోపించే వారు ఆధారాలతో ఆరోపిస్తే వాటికి విలువ ఉంటుందని సూచించారు.