: తమిళనాడులో నమో ఉద్యమం.. 200 టీ స్టాళ్లకు మోడీ పేరు
తమిళనాడులోనూ నరేంద్ర మోడీ(నమో) నామం మార్మోగిపోతోంది. మోడీని ప్రధానిని చేయాలన్న లక్ష్యం కోసం 'నమో పెరవాయ్' పేరుతో ఒక యూత్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. మోడీ రాజకీయాల్లోకి రాకముందు తన చిన్న వయసులో టీ స్టాల్ లో పనిచేశారు. దీన్ని ఉద్దేశించే టీ అమ్ముకున్న వాళ్లు కూడా ప్రధాని కావాలని కలలు కంటున్నారంటూ కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యాఖ్యానాలు చేశారు. మోడీ ఆ పనిని హుందాగా భావించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో 200 టీ స్టాళ్లకు నమో పేరు పెట్టాలని నిర్ణయించినట్లు నమో పెరవాయ్ కో ఆర్డినేటర్ ప్రవీణ్ శ్రీనివాసన్ తెలిపారు.
ఇప్పటికే ఈ రోడ్ జిల్లాలో ఒక టీ స్టాల్ ప్రారంభమైందని.. కోయంబత్తూరులో 7 నమో టీ స్టాళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నమో పెరవాయ్ తమిళనాడు వ్యాప్తంగా గ్రామాల్లో సభలను నిర్వహించడం ద్వారా మోడీ ప్రధాని కావలిసిన ఆవశ్యకతను తెలియజేయనుంది. తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. మోడీ పేరుతో ఏర్పాటు చేసిన టీ స్టాళ్లకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. నమో పెరవాయ్ లో విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, వర్తకులు, వాణిజ్యవేత్తలు ఇలా భిన్న రంగాలకు చెందిన వారున్నారు.