: భారీగా పెరగనున్న ఏసీలు.. రిఫ్రిజిరేటర్ల ధరలు


ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు వేడెక్కనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ కొత్త నిబంధనలే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఇవి వినియోగించుకునే విద్యుత్ ఆధారంగా వీటికి స్టార్ రేటింగ్ ఇస్తున్నారు. అయితే, ఇకపై 5 స్టార్ రేటింగ్ కోసం కంపెనీలు ఏసీలు, రిఫ్రిజిరేటర్లను మరింత సమర్థవంతంగా విద్యుత్ ను ఆదా చేసేలా మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు కాస్తా 4 స్టార్ కు పడిపోతాయి. అలాగే, 5 స్టార్ రేటింగ్ రిఫ్రిజిరేటర్లు 3 స్టార్ కు తగ్గిపోతాయి. 5 స్టార్ అంటే విద్యుత్ ఆదాలో నంబర్ 1 అని గుర్తు. దీని వల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 9 నుంచి 15 శాతం పెరుగుతాయని కంపెనీలు పేర్కొంటున్నాయి.

  • Loading...

More Telugu News