: సీఎం చివరి బంతి అంటే.. చివరి దాకా పదవిలో ఉండటమే: డిప్యూటీ సీఎం
సమైక్యాంధ్ర గళం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చివరి బంతి అంటే.. చివరి దాకా పదవిలో కొనసాగడమేనని ఎద్దేవా చేశారు. బిల్లుపై సభలో చర్చ జరగకుండా చూస్తూ సీమాంధ్రుల భవిష్యత్తుతో కిరణ్ ఆడుకుంటున్నారని, వాస్తవాలు చెప్పడం లేదన్నారు. మంత్రి ముఖేష్ గౌడ్ తో కలిసి ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 10న కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. సీమాంధ్రలో కిరణ్ హీరో కాకుండా చూస్తామని ఆయన అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతుందో లేదో చెప్పలేమన్నారు.