: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రాజు అలియాస్ బాలరాజును తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. శేషాచలం అడవుల్లో ఫారెస్ట్, టాస్క్ ఫోర్స్ అధికారుల సంయుక్త దాడుల్లో అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ రాజశేఖర్ మీడియాకు తెలిపారు. స్మగ్లర్ ను ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే, మరో బడా స్మగ్లర్ షాహుల్ హమీదీ పరారీలో ఉన్నాడని, ఇతనితో రాజుకు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. అతను దుబాయ్ లో ఉంటూ తన కార్యకాలాపాలు కొనసాగిస్తున్నాడని చెప్పారు.