: కేసీఆర్ కు చంద్రబాబు కౌంటర్
తన ఫాంహౌస్ లో అరవై ఎకరాలు సాగుచేస్తూ.. ఎకరాకు కోటి రూపాయల లాభాన్ని గడిస్తున్నానన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వెంటనే రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న రైతులు తమ భూములను కేసీఆర్ కు ఇవ్వాలని సూచించారు. ఆ భూములను కేసీఆర్ సాగుచేసి, ఎకరాకు రూ.5 లక్షలు రైతులకు ఇచ్చి, మిగతా రూ.95 లక్షలు ఆయనే తీసుకోవచ్చని అన్నారు. రైతుల భూములు తీసుకుని లాభాలు కురిపిస్తే కేసీఆర్ ఎంతో మేలు చేసినవారవుతారన్నారు.