: ఒకసారి మౌస్ క్లిక్ చేస్తే... ?


తినడం కంప్యూటర్ ముందు కూర్చోవడం. నేటితరం ఉద్యోగాలలో ఎక్కువ మంది చేసే పని ఇదే. మరి మనం ఆహారం రూపంలో తీసుకున్న కేలరీలు కంప్యూటర్ ముందు ఎలా ఖర్చవుతున్నాయి? అన్నసందేహం కొందరిలో ఉంటుంది. ఇలానే, ఒకసారి కంప్యూటర్ మౌస్ ను క్లిక్ చేయడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయో తెలుసుకోవాలని జపాన్ పరిశోధకులకు కూడా అనిపించింది. అందుకోసం వారు ఓ చిన్న పరిశోధన చేశారు.  

మౌస్ మీద ఒక క్లిక్ నొక్కితే మన శరీరంలో 1.42 కేలరీలు కరిగిపోతున్నట్లు ఇందులో తేలింది. అంటే 100 క్లిక్కులతో 142 కేలరీలు తరిగిపోతున్నాయన్నమాట. ఇది కూడా ఒక వ్యాయామమే. కానీ, శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామంతోనే ఫలితం ఉంటుందని నిపుణుల సలహా. కనుక మౌస్ ను నొక్కుతూ కూర్చోకుండా ఒంటికి కూడా పని చెప్పండి. ఆరోగ్యమస్తు!

  • Loading...

More Telugu News