: యడ్యూరప్ప రాకతో పెరగనున్న బీజేపీ బలం
కర్ణాటకలో యడ్యూరప్ప రాకతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి లాభించనుంది. పార్టీ తనను నిర్లక్ష్యం చేసిందనే కోపంతో బీజేపీ నుంచి బయటకు వెళ్లి కర్ణాటక జనతా పార్టీ పేరుతో యడ్యూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారకులైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరిగి యడ్డీ రాకతో బీజేపీ బలం ఇనుమడించనుంది.br>
కర్ణాటకలో లింగాయత్ లు, వొక్కలిగలు ప్రధాన అగ్రకులాలుగా ఉన్నాయి. లింగాయత్ లకు 18 శాతం ఓట్లు, వొక్కలిగలకు 12 శాతం ఓట్లు ఉన్నాయి. యడ్డీ లింగాయత్ వర్గానికి చెందిన ముఖ్యనేత. అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ ఓట్లు కాంగ్రెస్ కు 40 శాతం మళ్లగా.. మిగిలిన ఓట్లలో ఎక్కువ శాతం కర్ణాటక జనతా పార్టీకి పడ్డాయి. ఇప్పుడు ఆ ఓట్లలో అగ్రభాగం తిరిగి బీజేపీకి మళ్లుతాయని అనుకుంటే ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను సంపాదించవచ్చు. అదే సమయంలో అగ్రకుల వ్యతిరేకిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పేరుంది. ఇది కూడా బీజేపీకి లాభించేదే.