: దేశంలో 29 రాష్ట్రాలు..రాజీవ్ విద్యామిషన్ నిర్వాకం


రాజీవ్ విద్యామిషన్ అవగాహనా రాహిత్యంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ మీడియం 7వ తరగతి, తెలుగు మీడియం 8వ తరగతి సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో 5 మార్కుల విభాగంలో 29 వ ప్రశ్నగా దేశ పటం ఇచ్చి అందులో కోల్ కతా, చెన్నై, ముంబై, లక్నో, ఢిల్లీ లను గుర్తించాలని అడిగారు. అయితే దేశపటంలో 29 రాష్ట్రాలున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టు చూపడం వివాదానికి కారణమైంది. అవగాహనా రాహిత్యంతో ప్రశ్నాపత్రాన్ని తయారుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు డిమాండ్ చేయగా డీఈవో ఆ ప్రశ్నకు మార్కులు ఉండవని సెలవిచ్చారు.

  • Loading...

More Telugu News