: బీజేపీతో చంద్రబాబుది అక్రమ సంబంధం: సీపీఐ నారాయణ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జనతాపార్టీ (బీజేపీ)తో బాబు అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోందంటూ నారాయణ వ్యాఖ్యానించారు. కేంద్రం అసమర్థ పాలనతో రాష్ట్రంలో పరిపాలన దెబ్బతిందని ఆయన విశాఖలో విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత పార్టీలతో పొత్తు విషయం ఆలోచిస్తామని.. లేదంటే ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.