: ఆర్టీసీ ఏసీ బస్సుల్లో నేటినుంచి అగ్నిమాపక పరికరాలు: బొత్స


ఇటీవల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురవుతున్న నేపథ్యంలో రవాణాశాఖ నివారణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ రోజు నుంచి అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంతేగాక ప్రైవేటు బస్సుల వేగాన్ని నిరోధించడం, మద్యం సేవించే డ్రైవర్లపై టోల్ గేట్ల వద్దనే నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 24వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలని యజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News