: ప్రేమ మైకంలో ఇంటర్ తుంటరి


వయసు జోరు కుర్రకారుని నిలువనివ్వడం లేదు. సినిమాలు, సీరియళ్లు, సామాజిక వెబ్ సైట్లలో సాగుతున్న ప్రేమ ప్రచారం యువతరాన్ని ఊపేస్తోంది. దీంతో యువత ప్రేమబాట పడుతున్నారు. ప్రేమ మైకంలో ఏం చేసేందుకైనా సిద్ధపడుతున్నారు. తాజా ఇంటర్ చదువుతున్న ఓ తుంటరి ప్రేమపేరిట తన జీవితాన్ని జువైనల్ హోంకి అంకితం చేసుకున్నాడు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ బీజేఆర్ బస్తీలో నివాసముంటున్న 13 ఏళ్ల బాలికను... ఎనిమిది నెలలుగా అదే బస్తీలో ఉంటూ ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ప్రేమపేరుతో వేధించడం మొదలు పెట్టాడు.

దీంతో పెద్దలు అది సరికాదని భవిష్యత్ చాలా ఉందని బాగా చదువుకుని బాగుపడు అంటూ బాలుడ్ని హెచ్చరించి, ఏడవ తరగతి బాలికను ప్రేమించడమేంటని బాలుడి ఇంట్లో వారికి చెప్పి వారిని ఇళ్లు ఖాళీ చేయించారు. అయినా బుద్ధి తెచ్చుకోని బాల ప్రేమ పిశాచి నూతన సంవత్సరం సందర్భంగా పూటుగా తాగి, బాలిక ఇంట్లోకి చొరబడి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో అతడ్ని బాలిక తల్లిదండ్రులు, స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు అతడిపై వేధింపుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జువైనల్ హోంకి తరలించారు.

  • Loading...

More Telugu News