: కేంద్రం రాష్ట్రాన్ని వంచిస్తోంది: దేవినేని ఉమ
శాసనసభను విశ్వాసంలోకి తీసుకోకుండా, కోట్లాది మంది ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వంచిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, ఆమోదయోగ్యంకాని బిల్లును ప్రవేశపెట్టి చర్చించాలని చూడడం దారుణమని అన్నారు. విభజన వల్ల రెండు ప్రాంతాల్లో సమస్యలు వస్తాయని, అందువల్ల తక్షణం విభజన ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లో ఇతర పార్టీలతో కుమ్మక్కై విభజన కుట్ర పన్నిందని ఆయన మండిపడ్డారు.