: కేపీహెచ్ బీ కాలనీలో ‘ఆర్గానిక్ ఫ్యాషన్ షో’


గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో అందమైన భామలు వయ్యారంగా నడిచి హొయలొలికించారు. ‘ఆర్గానిక్ ఫ్యాషన్’ పేరుతో కేపీహెచ్ బీ కాలనీ ఆరో ఫేజ్ లో మోడళ్లు సందడి చేశారు. పలువురు మోడళ్లు నేచర్ ఉత్పత్తులతో తయారైన దుస్తులు ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. రంగు రంగుల పువ్వులతో రూపొందించిన వస్త్రాలు చూపరులను కట్టిపడేశాయి. కాలనీలోని ఆరో ఫేజ్ లో నందితాస్ కు చెందిన ఆర్గానిక్ బయో స్పా ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన ఫ్యాషన్ షో వీక్షకులను విశేషంగా అలరించింది.

  • Loading...

More Telugu News