: అశోక్ బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదు?: వీహెచ్
కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై సుమోటో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశో్క్ బాబు పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మీడియాతో వీహెచ్ మాట్లాడారు. అశోక్ బాబుపై సుమోటోగా కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.