: 'తెహల్కా' ఎడిటర్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ


'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు గోవా రాజధాని పనాజీలోని సెషన్స్ కోర్టు విచారణ జరపనుంది. ఈ మేరకు పోలీసులు ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. తన బెయిల్ పై రహస్యంగా విచారణ జరపాలని తేజ్ పాల్ న్యాయస్థానాన్ని ఇప్పటికే కోరారు. ఈ క్రమంలో విచారణ అలాగే జరిగే అవకాశం ఉంది. తన సంస్థలోని తోటి మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు రావడంతో తేజ్ పాల్ నవంబర్ లో అరెస్టయ్యారు. ప్రస్తుతం గోవాలోని సదా సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News