: ఆ వీడియో దేవయానిని తనిఖీ చేస్తున్నది కాదు: అమెరికా
ప్రస్తుతం ఒక వీడియో ఇంటర్నెట్ లో ప్రచారంలో ఉంది. భారత దౌత్యవేత్త దేవయానిని వీసా మోసం కేసులో అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేసి అగౌరవనీయ పద్ధతుల్లో బట్టలు విప్పి ఆసాంతం తనిఖీ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక వీడియో ఫుటేజీ ఇంటర్నెట్ లో ప్రచారంలో ఉండగా.. అది బూటకమని అమెరికా ఖండించింది. ఆ ఫుటేజీ ప్రమాదకరమైనదని, రెచ్చగొట్టేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ ప్రకటించారు. పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తుంటే.. అందులోని మహిళ కోపంతో అరుస్తున్నట్లుగా ఆ సీసీటీవీ వీడియో ఫుటేజీలో ఉంది. అయితే, ఈ వీడియో దేవయానిది కానేకాదని మేరీ హార్ఫ్ స్పష్టం చేశారు.