: కార్యకర్తల్లో జోష్ పెంచుతోన్న బాబు ప్రసంగాలు
పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. పదునైన వ్యాఖ్యలు, సునిశితమైన వ్యంగ్యోక్తులతో ఆయన ఆకట్టుకుంటున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోనూ బాబు అదే శైలిలో ముందుకెళుతున్నారు.
కవిటం వద్ద ఈరోజు నరసాపురం, పాలకొల్లు కార్యకర్తలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రైతు వ్యతిరేకినని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రాజశేఖర రెడ్డి ఆ విషయాన్ని రుజువు చేయలేకపోయారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయంలో అనేక నూతన సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టామని గుర్తుచేశారు.
దిగుమతులు పెంచే విధానాలకు రూపకల్పన చేయడంతో పాటు మార్కెట్లో మంచి ధర లభించేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. వైఎస్ ఇవేవీ చెయ్యకపోయినా ప్రచారం మాత్రం చేసుకున్నారని బాబు విమర్శించారు. ఇక తాము అధికారంలోకి వస్తే రుణ మాఫీ కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.