: స్వామి నిత్యానందపై ఫిర్యాదు


స్వామి నిత్యానందపై చెన్నై పోలీసులకు ఓ యాడ్ డిజైనర్ ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటనలకు సంబంధించి తనకు రూ.70 లక్షలు రావాలని, వాటిని ఇప్పించాలని కోరాడు. తిరు చెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగొట్టువేలు అనే వ్యక్తి 2011 నుంచి నిత్యానంద బిడది ఆశ్రమానికి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందిస్తున్నాడు. వాటికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ ఇంతవరకు చెల్లించకపోవడంతో తాజాగా పోలీసులను ఆశ్రయించాడు. అంతేగాక తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని, ప్రాణ రక్షణ కల్పించాలని కోరాడు. ఇటీవల నిత్యానంద ఆశ్రమానికి చెందిన నలుగురు మహిళా సన్యాసులు తనపై దాడి చేశారని, చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

  • Loading...

More Telugu News