: అధికారిక నివాసాన్ని తిరస్కరించిన కేజ్రీవాల్
కేంద్ర హోంశాఖ ప్రతిపాదించిన అధికారిక నివాసాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తిరస్కరించారు. గతంలో అధికారిక నివాసం వద్దన్న ఆయన నిన్న ఓకే చెప్పినట్లు, త్వరలోనే కొత్త నివాసానికి మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. దీంతో, వివాదాలు నెలకొనడంతో కేజ్రీవాల్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, కొత్త ఇంట్లోకి మారడంలో చాలా వివాదాలు నెలకొన్నాయని, అందుకే నివాసం మారడం లేదని స్పష్టంచేశారు.