: సభను అడ్డుకునే వారిని సస్పెండ్ చేయండి: హరీష్ రావు
శాసనసభలో టీబిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ఎమ్మెల్యేలు వారి ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. సభను వాయిదాలు వేయడం ద్వారా రాష్ట్రపతిని, రాజ్యాంగ వ్యవస్థను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. సభను ఉద్యేశపూర్వకంగా అడ్డుకోవడం ద్వారా... చివరకు సమయం సరిపోదని చెప్పడానికి కుట్రలు పన్నారని ఆరోపించారు. సభను అడ్డుకుంటున్న వారిని స్పీకర్ సభనుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.