: శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి బలరాం నాయక్
తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీధర్ బాబు శాఖ మార్చడం సరైన పధ్ధతి కాదని, తెలంగాణ బిల్లుకు ఫిబ్రవరిలో ఆమోదం లభిస్తుందని, రాష్ట్ర విభజన తరువాతే ఎన్నికలు జరుగుతాయని అన్నారు.