: రెండో రోజుకు చేరిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల సంకల్ప దీక్ష


రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ... సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హైదరాబాద్ ఇందిరాపార్కులో చేపట్టిన సంకల్ప దీక్ష రెండో రోజుకు చేరింది. ఈ దీక్షలో ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, హర్షకుమార్ పాల్గొన్నారు. వీరికి సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరంలోకి తెలంగాణవాదులు చొచ్చుకొచ్చే అవకాశం ఉండటంతో, నిన్న రాత్రి శిబిరం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీక్షా శిబిరంలోకి వెళ్లేవారిని కూడా మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలకు పంపిస్తున్నారు.

  • Loading...

More Telugu News