: ఇది శునకం గారి స్టయిల్!


కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా, బుద్ధి మార్చుకోకుండా శునకం తన 'పని' తాను చేస్తుందని వెనకటికి మనకో సామెత వుంది. అయితే, ఆ పని చేయడానికి కూడా సదరు శునకానికి ఓ పద్ధతుందని ఇప్పుడు తెలిసింది. విసర్జన సమయంలో కుక్కలు ఒక ప్రత్యేక దిశలో నిల్చుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. విసర్జనకు ముందు కుక్కలు భూమి ఉత్తర, దక్షిణ అక్షానికి సమాంతరంగా నిల్చుంటాయని జర్మనీలోని చెక్‌ విశ్వవిద్యాలయం, డ్యూసెన్‌బర్గ్‌ ఎస్సెన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక ప్రత్యేక అధ్యయనంలో తేలింది.

వీరు సుమారు 37 రకాల విభిన్న జాతులకు చెందిన 70 కుక్కలపై రెండేళ్లపాటు పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో వీరు ఈ విషయాన్ని కనుగొన్నారు. అయితే ఇలా కుక్కలు ఎందుకు ప్రవర్తిస్తాయి? అనే విషయాన్ని మాత్రం తాము తెలుసుకోలేకపోతున్నామని, భూ అయస్కాంత క్షేత్రం స్తబ్దుగా ఉన్నప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నట్టు తాము గుర్తించామని పరిశోధకులు చెబుతున్నారు. అయినా కుక్కల విసర్జనపై కూడా పరిశోధన చేయాలని ఎలా అనిపించిందో... మరి వీరి పరిశోధనలో తర్వాత తర్వాత ఏం విషయం తేలనుందో...!

  • Loading...

More Telugu News