: కేన్సర్‌కు కొత్తరకం చికిత్స
కేన్సరు వ్యాధిని ఎదుర్కోవడానికి వివిధ రకాల చికిత్సను శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. ఈ నేపథ్యంలో బంగారంతో చికిత్స చేయడాన్ని విశాఖకు చెందిన ఒక శాస్త్రవేత్త కనుగొన్నారు. బంగారు రజనుతో నానో థెరపీ ద్వారా ఇతర కణాలకు హాని జరగకుండా కేన్సర్ వ్యాధికి చికిత్స చేయవచ్చని డాక్టర్ వి.రవిరాజ్ చెబుతున్నారు.
మన రాష్ట్రంలో రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీ చదివిన రవిరాజ్ ప్రస్తుతం తైవాన్ నేషనల్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. ఈయన శుక్రవారం నాడు తన పరిశోధనా ఫలితాలను వెల్లడించారు. స్వర్ణరజను ద్రావకాన్ని 60 నుండి 70 నానో మీటర్ల పరిమాణంలో ఎలుకల శరీరంలోకి ఇంజక్షన్ చేసి కేన్సర్‌పై దీని ప్రభావాన్ని పరిశీలించినట్టు తెలిపారు. తాను ఎలుకలపై చేసిన ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చిందని, దీనిపై పేటెంట్ కోసం తాను దరఖాస్తు చేసుకుంటున్నట్టు రవిరాజ్ తెలిపారు.