: అత్యచార కేసుల్లో సత్వర విచారణకు బీహార్ ప్రభుత్వం ఆదేశం
దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్య కేసులపై ఒక్కో రాష్ట్రం ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల పాట్నాలో ఓ మహిళపై పోలీసులు ప్రవర్తించిన తీరుతో బీహార్ ప్రభుత్వం మేలుకొంది. పెండింగ్ లో ఉన్న కేసులపై సత్వర విచారణ చేపట్టాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలావుంచితే, గత ఏడాది అక్టోబర్ వరకు బీహార్లో 823 అత్యాచార కేసులు నమోదయ్యాయి!