: కదులుతున్నా కూడా స్కానింగ్‌ చేస్తుంది


ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేసేటప్పుడు రోగి అస్సలు కదలకూడదు. అలా కాకుండా కదులుతున్నా కూడా స్కానింగ్‌ చేసేలాగా ఒక కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మణికట్టు కదలికలను తెలుసుకునేందుకు ఈ పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పద్ధతి ద్వారా మణికట్టుకు సంబంధించి అన్ని వైపులా కదలికలను రికార్డు చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ కొత్త తరహా స్కానింగ్‌ పద్ధతిని అభివృద్ధి చేసింది. ఈ పద్ధతిని యాక్టివ్‌ ఎంఆర్‌ఐగా పిలుస్తారు. భారత సంతతికి చెందిన అభిజిత్‌ చౌదరి కూడా పాల్గొన్న ఈ బృందం అభివృద్ధి చేసిన ఈ యాక్టివ్‌ ఎంఆర్‌ఐ స్కానింగ్‌తో మణికట్టు కదులుతున్నా కూడా పరీక్షించవచ్చని అభిజిత్‌ చెబుతున్నారు. సాధారణ ఎంఆర్‌ఐ ద్వారా మణికట్టు ఒక స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే పరీక్షించగలమని, కానీ ఈ పద్ధతితో మణికట్టు కదులుతున్నా కూడా స్కానింగ్‌ చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ స్కానింగ్‌ ద్వారా మణికట్టు పనితీరును కచ్చితంగా తెలుసుకోవచ్చని, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధులను గురించి ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుందని అభిజిత్‌ చౌదరి తెలిపారు.

  • Loading...

More Telugu News