: విఫలమయ్యామని సాక్షాత్తూ ప్రధానే ఒప్పుకున్నారు: అరుణ్ జైట్లీ
ధరల పెరుగుదలను నియంత్రించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని సాక్షాత్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నారని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ఆన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల యూపీఏ పాలనలో 2జీ కుంభకోణం, బొగ్గు కుంభకోణాలను అరికట్టేందుకు ప్రధాని ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏ రకమైన చర్యలూ తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. ఈ రోజు ప్రధాని ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన వీడ్కోలు సమావేశంలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.