: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబును కలిసిన డ్వాక్రా మహిళలు


హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును డ్వాక్రా మహిళలు కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే డ్వాక్రా సంఘాలకు అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు వచ్చేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. మహిళల రక్షణకు జిల్లా స్థాయిలో ఎస్పీని నియమిస్తామని, అలాగే రాష్ట్ర స్థాయిలో ఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా మహిళల రక్షణకు నియమించనున్నట్లు చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా ఫోన్ చేస్తే.. ఇంటికి వచ్చి రక్షణ కల్పించే విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News