: ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది: న్యాయవాది
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అయితే ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తరపు న్యాయవాది అహ్మద్ రజా కసురి తెలిపారు. కాగా, ముషారఫ్ గుండెలో మూడు నాళాలు మూసుకుపోవడంవల్ల వెంటనే యాంజియోప్లాస్టీ కానీ, బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు చెప్పినట్లు పాక్ మీడియాకు వివరించారు. స్వల్ప గుండెపోటు కారణంగా నిన్న ముషారఫ్ ను రావల్పిండిలోని మిలటరీ ఆసుపత్రిలో చేర్పించారు.