: చిరంజీవి చానల్ కూడా డబ్బింగ్ సీరియళ్లను నిలిపివేయాలి: దాసరి


తెలుగు సీరియల్ పరిశ్రమను బతికించుకోవాలంటే అనువాద సీరియళ్లకు అడ్డుకట్టవేయాలని ఇటీవల ఉద్యమస్థాయిలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దాసరి నారాయణ రావు లాంటి సినీ దిగ్గజాలు కూడా తెలుగు సీరియల్ ఆర్టిస్టులకు మద్దతుగా నిలిచారు.

టెలివిజన్ పరిరక్షణ సమితికి సారథ్యం వహిస్తున్న దాసరి.. డబ్బింగ్ సీరియళ్ల ప్రసారాన్నినిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఈటీవీని అభినందించారు. అయితే, చిరంజీవికి చెందిన చానల్ లో ఇంకా డబ్బింగ్ సీరియళ్లు ప్రసారం అవుతూనే ఉన్నాయని, చిరంజీవి ఆ విషయమై చర్య తీసుకోవాలని దాసరి డిమాండ్ చేశారు.

కాగా, అనువాద సీరియళ్లను నిలిపివేయని చానళ్ల కార్యాలయాల ముందు రేపటి నుంచి ధర్నాలు నిర్వహిస్తామని, టెలివిజన్ పరిరక్షణ సమితి గురువారం హెచ్చరించింది. 

  • Loading...

More Telugu News