: ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి మృతి
ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డి(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం మరణించారు. వెంకట్రామిరెడ్డి రాష్ట్ర క్రీడా రంగంలో వివిధ పదవులు నిర్వహించారు.