: ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించిన కృష్ణాజిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు జిల్లాలో జరుగుతోన్న ఓటర్ల నమోదు, వాటి సర్వే వివరాలను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల డేటా నమోదును ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఓట్ల తొలగింపు, దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలపై రికార్డులను తెప్పించి పరిశీలించారు. దరఖాస్తు తిరస్కరణకు గల కారణాలను ఆయా ఓటర్లకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల ఆన్ లైన్ నమోదులో వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదని ఫిర్యాదులు తరచుగా అందుతున్నాయని.. సైట్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.