: ఇన్ఫోసిస్ కు ఇద్దరు కొత్త అధ్యక్షులు


భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఇద్దరు డైరెక్టర్లను కంపెనీ అధ్యక్షులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న బీజీ శ్రీనివాస్, యూబీ ప్రవీణ్ రావ్ లిద్దరూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ డీ శిబులాల్ కు రిపోర్ట్ చేస్తారని ఇన్ఫోసిస్ వర్గాలు వెల్లడించాయి. శ్రీనివాస్ గ్లోబల్ మార్కెట్ వ్యవహారాలు చూస్తారని... గ్లోబల్ డెలివరీ, సర్వీస్ ఇన్నోవేషన్ కార్యక్రమాలను ప్రవీణ్ పర్యవేక్షిస్తారని కంపెనీ తెలిపింది. క్లయింట్ రిలేషన్ షిప్, మార్కెట్ లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కంపెనీ ఈ మార్పులు చేసింది.

  • Loading...

More Telugu News