: రహదారి భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్న అమీర్ ఖాన్
ముంబయి పోలీసులు రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు.. ప్రమాద నివారణ చర్యల గురించి వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే.. ఈ వారోత్సవాల్లో అకస్మికంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బైక్ పై వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు.. రోడ్ సేఫ్టీ పై ముంబయి పౌరులకు అవేర్ నెస్ తీసుకొస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసులకు కరచాలనం చేసి మరీ అభినందించాడు. ఇంకేముంది.. మన ముంబయి పోలీసులు అమీర్ అభినందనలతో ఆనందంలో తేలిపోయారు.