: 5వ తేదీన కాకినాడ జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని జేఎన్టీయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం ఈ నెల 5వ తేదీ, ఆదివారం నాడు నిర్వహించనున్నట్లు జేఎన్టీయూ(కె) ప్రిన్సిపల్ డాక్టర్ పద్మరాజు పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరి మొదటివారంలో వచ్చే మొదటి ఆదివారం నాడు పూర్వవిద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి సమ్మేళనానికి కుటుంబ సమేతంగా రావాలని పూర్వ విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం జేఎన్టీయూ(కె) వైస్ ప్రిన్సిపల్ సుబ్బారావును (ఫోన్. 99639 93501) సంప్రదించాలని ఆయన సూచించారు.