: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ముగిసిన చర్చలు
ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు పూర్తయ్యాయి. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించే ఉత్తర్వులు రేపు జారీ చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారని... అయితే అది అమలుకు నోచుకునేంతవరకు తాము సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. చర్చల్లో వేతన సవరణపై స్పష్టత రాలేదని దానిపై ఈ నెల 9న మరోసారి యాజమాన్యంతో భేటీ అవుతామని కార్మిక సంఘాలు తెలిపాయి.