: రేపు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం.. రైతు రుణాలపై సమీక్ష
రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు అందించాల్సిన రుణాలు, పౌల్ట్రీ రుణాలు, రైతులకు వడ్డీ లేని రుణాలు, స్వల్పకాలిక రుణాలు, వర్షాధార పంటల బీమా తదితరాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.