: చికిత్స కోసం విదేశాలకెళ్తా.. అనుమతించండి
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ గుండె నొప్పితో నిన్న ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ... ఇస్లామాబాద్ కోర్టులో ముషారఫ్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ముఫారఫ్ దేశ ద్రోహంతో పాటు పలు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.