: 'నిర్భయ' కేసులో తీర్పును రిజర్వులో ఉంచిన ఢిల్లీ హైకోర్టు
2014, డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం కేసు (నిర్భయ కేసు)లో నలుగురు నిందితులకు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నిందితులు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ కేసును ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారించిన అనంతరం... తీర్పును రిజర్వులో ఉంచింది. తీర్పుపై నిందితులు పెట్టుకున్న విన్నపంపై ఈ రోజు జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభా రాణి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ఎదుట ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్లు వాదనలు వినిపించారు. లిఖిత పూర్వకంగా తమ వాదనలను ఈ నెల 15లోగా సమర్పించాలని డిఫెన్స్ లాయర్ కు చెప్పింది.