: 119 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్రంలో 119 కరవు మండలాలను గుర్తిస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 59, చిత్తూరులో 33, వైఎస్సార్ కడపలో 16 కరవు మండలాలను ప్రభుత్వం గుర్తించింది. విజయనగరం జిల్లాలో 5, మహబూబ్ నగర్ లో 3, మెదక్ 2, నల్గొండలో ఒక్క మండలంలో కరవు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.