: పాలెం బస్సు బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతా: సినీ హీరో శివాజీ
పాలెం వోల్వో బస్సు ప్రమాద బాధితులకు సినీ హీరో శివాజీ సంఘీభావం ప్రకటించాడు. హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో బాధితుల తరఫున ఆయన మాట్లాడాడు. బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తాను ఓ సామాన్యుడిగానే స్పందిస్తున్నానని చెప్పాడు. రానున్న పండుగలోగా బాధితులకు న్యాయం చేయకపోతే... బాధితుల తరఫున తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించాడు.
నేతలంతా తమ కుటుంబాల కోసం... తమ సుఖాలకోసం మాత్రమే తాపత్రయపడుతున్నారని విమర్శించాడు. బంగారు తల్లి పథకానికి నిధులను కేటాయించిన ప్రభుత్వం... ఈ తల్లుల విషయంలో నిర్దయగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజలందరూ చట్ట బద్ధంగా తిరిగే బస్సుల్లోనే ప్రయాణించాలని కోరాడు. చట్ట విరుద్ధంగా తిరిగే బస్సులపై ఆర్టీఏకు ఫిర్యాదు చేయాలని సూచించారు.