: కడప పెద్ద దర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు
కడప నగరంలోని పెద్ద దర్గాలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మహ్మద్ మహమ్మదుల్ అమీన్ పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ ఉత్సవాలకు భక్తులు విచ్చేశారు. దర్గాలోని అమీన్ పీర్ సాహెబ్ మజార్ ను దర్శించుకుని పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిన్న (గురువారం) అర్థరాత్రి అనంతరం ప్రస్తుత పీఠాధిపతి గంధ కలశాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సినీ నటుడు రాజ్ కుమార్, టీవీ సీరియల్ సంగీత దర్శకుడు ఖుద్దూస్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఇవాళ ఉరుసు సందర్భంగా షాహిన్ ఖవ్వాలీ కార్యక్రమం నిర్వహించనున్నారు.