: బిల్లు ఆమోదించవద్దని మా అగ్రనేతలను కోరతాం: బీజేపీ నేత హరిబాబు


అసెంబ్లీకి వచ్చిన టీబిల్లు సీమాంధ్రుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. ఓటింగ్ లేకుండా బిల్లును పార్లమెంటులో ఆమోదించరాదని తమ అగ్రనేతలను కోరతామని చెప్పారు. ఈ రోజు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని, రాయలసీమ ప్రాజెక్టులకు రక్షణ కలిగించాలని డిమాండ్ చేశారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్ర ప్రాంతంలోనే కలపాలని కోరారు.

  • Loading...

More Telugu News