: పార్టీ అధిష్ఠానానికి జేసీ లేఖ
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. సోనియా, రాహుల్ పై చేసిన వ్యాఖ్యలకు తనకు పంపిన షోకాజ్ నోటీసుకు శాసనసభ సమావేశాల అనంతరం సమాధానం ఇస్తానని తెలిపారు. కాగా, శ్రీధర్ బాబు శాఖ మార్పు విషయంలో ఆయనకు ఎలాంటి అన్యాయం జరగలేదన్నారు. ఆయన మంచి కోసమే సీఎం శాఖ మార్పుచేసినట్లు తెలిపారు.