: కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ఎంపీ నామా
కాంగ్రెస్ పార్టీపై ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "దేశాన్నే నాశనం చేసిన కాంగ్రెస్ కు మరో నేతను విమర్శించే హక్కు ఎక్కడుంది?" అని ప్రశ్నించారు. స్వయంగా అవినీతిని పెంచి పోషించిన సోనియాగాంధీ, రాహుల్, మన్మోహన్ లు దాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తామనడం వింతగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బొగ్గు స్కాం దస్త్రాలు తన కార్యాలయంలోనే మాయమైనా నోరువిప్పని ప్రధాని నీతులు చెబుతారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్ లోనూ పడుతుందని హెచ్చరించారు. విభజన బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలను తొలగించాలని నామా డిమాండ్ చేశారు.